Sunday, June 20, 2010

మా నాన్న గారు...


చిన్నపుడు..
నీ చిటికను వేలు పట్టించి నాకు నడకలు నేర్పించావు...!
నే పెరిగిన సమయంనా నాకు సైకిల్ నేర్పించావు...!
ప్రతి సారి నే పడిన సమయమున నీ చేయన్దిన్చావు... !
నా చేష్టలకు అమ్మ తిడుతుంటే అమ్మను బెదిరించావు...!
అన్నయ్యల కంటే నన్నే ఎక్కువ ప్రేమించావు... !
నే పెరిగిన కొలది నను నీ భాద్యత అనుకున్నావు...
నీ వెంట ఉన్నంత కాలం భయమేమిటో తెలియదు నాకు !
కాని
పెళ్లిడుకి వచ్చానా అని తలుచుకుంటే భయమేస్తుంది నాన్న .....
నాకు ఎగరే రెక్కలు వచ్చాయని ...
నీ చేతిలో నుండి వదిలేస్తున్నావా నాన్న .......


ఇట్లు
నీ
చిన్నారి ....
నువ్వు ముద్దుగా పిలిచే "అమ్మ" ని...

Sunday, June 13, 2010


మంచు కురిసే వెన్నెలలోతడిచా నే తొలిసారిగా....
ఆ వెండి మబ్బుల నీడలోచూసా నిన్ను తొలిసారిగా....
తెలియని అలజడి ఏంటోకలిగింది నాలో తొలిసారిగా...
నన్ను కలవరపెడుతున్న ఆ అలజడి ప్రేమేనేమో అనిపిస్తుంది తొలిసారిగా.....
మరి నిమిషమైన నిలవని నేనునీకై నిరీక్షిస్తున్న తొలిసారిగా ...
నా ప్రియతమా...నా ఈ నీరిక్షణకు ఫలితం దక్కేది ఏనాడో ?
ఈ జన్మలోన లేదా మరుజన్మలోనా.....
అది ఎప్పుడైనా సరే నా హృదయం వేచి చూసేది నీ కోసమే ప్రియా....

ఇట్లు
మీ
నేను...

Saturday, June 12, 2010


నిన్ను చుసిన క్షణం....
నన్ను నేను మరచిపోయ...
ఆ ... మరు క్షణం నువ్వు కనిపించక
పరితపించిపోయా....
నీకై వెతుకులాటలో
ఎక్కడో నన్ను నేను పారేసుకున్న
జీవితాన్ని చేజార్చుకున్నాను...
ఇప్పుడు అంత శూన్యం ...
నీ కన్నుల వెలుగులో నా జీవితాన్ని
నింపుకోవాలని ...
నా కన్నుల లోగిలో నిన్ను బందించాలని ఉంది సుమా.....


ఇట్లు
మీ
నేను.....