Sunday, June 20, 2010

మా నాన్న గారు...


చిన్నపుడు..
నీ చిటికను వేలు పట్టించి నాకు నడకలు నేర్పించావు...!
నే పెరిగిన సమయంనా నాకు సైకిల్ నేర్పించావు...!
ప్రతి సారి నే పడిన సమయమున నీ చేయన్దిన్చావు... !
నా చేష్టలకు అమ్మ తిడుతుంటే అమ్మను బెదిరించావు...!
అన్నయ్యల కంటే నన్నే ఎక్కువ ప్రేమించావు... !
నే పెరిగిన కొలది నను నీ భాద్యత అనుకున్నావు...
నీ వెంట ఉన్నంత కాలం భయమేమిటో తెలియదు నాకు !
కాని
పెళ్లిడుకి వచ్చానా అని తలుచుకుంటే భయమేస్తుంది నాన్న .....
నాకు ఎగరే రెక్కలు వచ్చాయని ...
నీ చేతిలో నుండి వదిలేస్తున్నావా నాన్న .......


ఇట్లు
నీ
చిన్నారి ....
నువ్వు ముద్దుగా పిలిచే "అమ్మ" ని...

3 comments: