Wednesday, August 18, 2010

నశించి పోతున్న మానవత్వమా... !!!


బుక్కెడు కూడుకు దిక్కులేని జనం ఆకలికి అలమటిస్తుంటే...

పైసల కట్టలకు ప్రాణం వచ్చి పరాయిల పాలై పోతుంటే...

కుప్పలు తెప్పలుగా బలైపోతున్న జీవుల చావుల లెక్కలు కడుతుంటే...

ఆవేశం కడలి కెరటంలా కన్నుల్లో ఉప్పొంగుతోంది...!

ఆవేదన అగ్నిజ్వాలలా మనసును దహించివేస్తుంది...!

ఆక్రోడం కట్టలు తెంచుకొని అంతిమ యాత్రకు పరిగెడుతుంది...

బ్రతుకంటే జూదమేనా...???

మానవత్వమా నీవెక్కడ!!!

నీకు, ప్రానముంటే

పంచభూతాల సాక్షిగా,కదులు, మౌనం వాదులు...

శిలలా మిగిలిన భారతమాతకు భవితనివ్వు...


నాకు జన్మనిచ్చి ఊపిరి పోసిన మాత్రుమూర్తి...నీవు...
నీ ప్రేమను పంచి నాకు జివితాన్నిచావు..
గురువై నాకు జ్ఞానవేలుగును పంచావు...
నేస్తానివై నా మనసును క్లుప్తంగా చదివావు...
నా కన్నీటిలో ఒదార్పువై నిలిచావు...
నా ఆనందంలో చిరునవ్వులు చిందించావు...
ఎలా మరువగలను నీ చేతి కమ్మని గోరుముద్దలను...
ఎలా మరువగలను నీ కొంగుచాటు నా చిన్నతనాన్ని...



సదా నీ సేవలో నీ ముద్దుబిడ్డ.....
నీ రాధా........


కని నా పైన పెంచుకున్న మమతను చూసి... భందమంటీ ఏమిటోతెలుసుకున్నాను ...అమ్మ... నను నీ భాద్యతగ మలచుకున్న నీ హృదయాన్ని చూసి...
ఆత్మీయత అంటే ఏమిటో తెలుసుకున్నాను ...అమ్మ..
కుటుంబం కోసం నువ్వు కూర్చిన గౌరవం చూసి..
కుటుంబం పరువేమిటో తెలుసుకున్నాను ...అమ్మ...
ఆత్మీయతను పంచె అనురాగం నీలో చూసి..
అనుభందం అంటే ఏమిటో తెలుసుకున్నాను ...అమ్మ..
అహర్నిశలు కష్టించే నీ శ్రమని చూసి...
కృషి అంటే ఏమిటో తెలుసుకున్నాను ...అమ్మ..
అవమానాల్ని సహించే నీ సహనాన్ని చూసి...
ఓపిక అంటే ఏమిటోతెలుసుకున్నాను ...అమ్మ..
నీ పాదాలతో నందనవనం చేసిన మన ఇంటిని చూసి...
బృందావనం అంటే అమ్మ ఉండే చోటని తెలుసుకున్నాను అమ్మ..

ఇట్లు..

నేను గర్వంగా చెప్పుకునే నీ బిడ్డను....రాధా...

అమ్మ జగతిలో నీకంటే గొప్ప ప్రేమేముంది??


అమ్మ...

నే పలికిన నా తొలి పలుకులు అమ్మ...

ఆనందానికి మరో పేరు నీ దివ్య రూపం అమ్మ....

స్వర్గం అంటే ఏమిటో యదఅలసి నిదురించిన నీ ఒడిలో చూసాను అమ్మ...

అమృతం అంటే ఏమిటో నా నోటికి అందించిన నీ గోరుముద్దల్లో చూసాను అమ్మ...

మనసుకు హాయి అంటే ఏమిటో నను మైమరిపించిన నీ జోలపాటలో చూసాను అమ్మ...

అదృష్టం అంటే ఏమిటో ఇప్పటికికూడా ఇంచైనా తరుగని నీ ప్రేమలో చూస్తున్నా అమ్మ...

ఇట్లు

నువ్వు ముద్దుగా పిలిచే

నీ ముద్దుల బిడ్డ....