Wednesday, August 18, 2010


కని నా పైన పెంచుకున్న మమతను చూసి... భందమంటీ ఏమిటోతెలుసుకున్నాను ...అమ్మ... నను నీ భాద్యతగ మలచుకున్న నీ హృదయాన్ని చూసి...
ఆత్మీయత అంటే ఏమిటో తెలుసుకున్నాను ...అమ్మ..
కుటుంబం కోసం నువ్వు కూర్చిన గౌరవం చూసి..
కుటుంబం పరువేమిటో తెలుసుకున్నాను ...అమ్మ...
ఆత్మీయతను పంచె అనురాగం నీలో చూసి..
అనుభందం అంటే ఏమిటో తెలుసుకున్నాను ...అమ్మ..
అహర్నిశలు కష్టించే నీ శ్రమని చూసి...
కృషి అంటే ఏమిటో తెలుసుకున్నాను ...అమ్మ..
అవమానాల్ని సహించే నీ సహనాన్ని చూసి...
ఓపిక అంటే ఏమిటోతెలుసుకున్నాను ...అమ్మ..
నీ పాదాలతో నందనవనం చేసిన మన ఇంటిని చూసి...
బృందావనం అంటే అమ్మ ఉండే చోటని తెలుసుకున్నాను అమ్మ..

ఇట్లు..

నేను గర్వంగా చెప్పుకునే నీ బిడ్డను....రాధా...

No comments:

Post a Comment